బోయపల్లి గ్రామంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

మహబూబ్ నియోజకవర్గం పి. అర్. రాఘవేంద్ర, మహబూబ్ నగర్ మండల నాయకుల ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ మండలం, బోయపల్లి వార్డులో జనసైనికుల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వంగ లక్ష్మణ్ గౌడ్ జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు, నాగర్ కర్నూల్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ హాజరై మహబూబ్ నగర్ పట్టణంలోని బస్ స్టాప్ సమీపంలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి, అనంతరం బోయపల్లి వార్డులోనీ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి, సమావేశానికి హాజరై జనసైనికులకు పార్టీ బలోపేతం పట్ల దిశ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జనసేన పార్టీ బలోపేతామే లక్ష్యంగా జనసైనికులు ముందుకు అడుగులు వేయాలని కోరుతున్నాము.. రబ్బర్ చెప్పులేసుకున్న సామాన్య యువకులతో రాజకీయం చేయిస్తా అనే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాన్ని బలపరచాలంటే గ్రామస్థాయిలో యువకులు గ్రామ అభివృద్ది కోసం ముందుకు రావాలి. జనసేన పార్టీ పట్ల ఆసక్తి కరంగా ఉన్న యువకులను బేదురిస్తున్న బి.అర్.ఎస్ నాయకులకు ఒక్కటే సావల్ విసురుతున్న. దమ్ముంటే మీరు ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం ప్రతి గ్రామంలో ఎంత మందికి ఇచ్చారనే లిస్ట్ విడుదల చేసి ఎన్నికల్లో ఓటు అడగటానికి మా ఇళ్లకు రండి. 1200 వందల మంది విద్యార్థులు బలిదానాలతో సాధించుకున్న మన తెలంగాణ రాష్ట్రంలో కులాలతో విభజించు – పాలించు అనే ధోరణితో, ఆ ఆలోచన విధానంతో తెలంగాణ ప్రజలను విదిధిసే రాజకీయం చేస్తున్నారు. దేని కోసం తెలంగాణ సాధించుకున్నాం. వాడి కింద, వీడి కింద బానిస బ్రతుకు బ్రతకాడినికా..??. ఈ బానిస బతుకులు పోవాలంటే గ్రామాల్లోని యువకులు, జనసైనికులు గ్రామాల్లోని సమస్యల పట్ల జనసేన పార్టీ తరపున పోరాటం చేయాలని జనసైనికులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాయకులు గోపాస్ కుర్మన్న, రాకేష్ రెడ్డి, శరత్ గౌడ్, మహబూబ్ నగర్ నియోజకవర్గ నాయకులు, గౌరవ్, డి. వెంకటేష్, ఏమ్. చంద్ర శేఖర్, పి. వెంకటేష్, రమేష్, శివ కుమార్, గోపాల్, సంజివా, శంకర్, వినోద్, అన్నవరం కల్యాణ్, విజయ్ భాస్కర్ గౌడ్, సూర్య, రాజు నాయక్, ఎడ్ల రాకేష్, పూస శివ, మహేష్ మహబూబ్, కే. వెంకటేష్, వి. వి.చారి, నర్సింహ, సురేష్, ప్రదీప్, హనుమంతు, పవన్, శ్రీకాంత్, ప్రవీణ్, శ్రీకాంత్, పవన్ కుమార్, కేశవులు, భాను ప్రకాష్, ప్రదీప్, బాలు, శ్రీనివాసులు, రంగా, హుస్సేన్, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.