కడప జనసైనికుల ఆత్మీయ సమావేశం

కడప నగరంలోని కింగ్స్ ప్యాలస్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా కడప జనసైనికుల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. జనసేన పార్టీ రాయలసీమ ఎన్నికల కార్యక్రమాల కమిటీ కో-కన్వీనర్ పండ్రా రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథులుగా టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అనంతరం జనసేన కార్యకర్తలుతో మూడు తీర్మానాలు చేశారు అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు జనసేన పార్టీ ఓట్ల అన్ని జనసేన, టిడిపి, బిజెపి, బలపరిచిన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి మాధవి రెడ్డికి వేసే విధంగా ప్రతి ఒక్క జనసైనికుడు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్బంగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనకు చరమ గీతం పాడాలని మూడు పార్టీలు కలిశాయన్నారు. రాక్షస అంతమొందించాలని దేవతలంతా ఒక్కటైనట్టు టీడీపీ, జనసేన, బిజెపి కలిసాయన్నారు. 2014 లో జనసేన-టీడీపీ పొత్తు ఉండేదని అప్పుడు కూడా రంజిత్ చాలా కష్టపడి పనిచేసాడని ఇప్పుడు కడపలో టీడీపీ అభ్యర్థి మాధవి రెడ్డి గెలుపుకు ప్రతి జనసేన కార్యకర్త ఇంటింటికి వెళ్లి కష్టపడి పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి హరిప్రసాద్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి, బిజెవైఎం జిల్లా అధ్యక్షులు బొమ్మన విజయ్, జనసేన నాయకులు తుంగ రమణ, అబ్బన్న గారి రాజగోపాల్, సాయి కృష్ణ ఆచారి, రాజశేఖర్, బాలు నాయక్, కుమార్ నాయక్, మనీ, సాయి స్వరూప్, సిద్ధార్థ, తోట సుమన్, లోకేష్, సద్దాం, రామకృష్ణ, దేవకుమార్, వంశీకృష్ణ, టీడీపీ నాయకులు బండి బాబు, బీజేపీ నాయకులు చలపతి తదితరులు పాల్గొన్నారు.