రాష్ట్రంవైపు తుఫాన్ తరుముకొస్తోంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – జనసేన పార్టీ

  • రైతులు పండించిన ధాన్యం స్టోరేజ్ విషయంలో అప్రమత్తంగా ఉండండి
  • ప్రభుత్వ అధికారులకు అందరూ సహకరించండి

పార్వతీపురం: బంగాళాఖాతంలోని వాయుగుండం శోంవారం, మంగళవారం తీవ్రవాయుగుండంగా మారి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని, ఏపీ విపత్తుల వారి నుండి సమచారం అందుతుంది కావున. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పార్వతీపురం జనసేనపార్టీ నాయకులు “చందక అనీల్” పిలిపునిచ్చారు. అలాగే ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా లోతట్టు ప్రాంతంలో ఉన్నవారు తగు జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలి అని. ఈ రెండు రోజులు ఇంట్లోనే ఉండాలి బయటకి రావద్దు అని కుడా సూచనలు ఇచ్చారు. అలాగే అధికారులు చెప్పే సంచారం ప్రకారం సుమారు 80 నుండి 90 కిలోమీటర్ల వేగంగా గాలులు వీచే అవకాశం ఉంది అంటున్నారు. కావున ఈ తుఫాన్ తీరం దాటే వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. రైతులు కూడా పండించిన ధాన్యం స్టోరేజ్ చేసుకోవడంలో అప్రమత్తంగా ఉండాలి అని పార్వతీపురం జనసేన పార్టీ నుంచి పిలుపునిస్తున్నాం అని తెలిపారు.