డాక్టర్ పిల్లా దీపిక శ్రీధర్ ఆధ్వర్యంలో విజయవంతంగా మెగా ఉచిత మెడికల్ క్యాంపు

పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు నందు పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు మరియు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా దీపిక శ్రీధర్ ఆధ్వర్యంలో అరిపి వెంకటేష్, అరిపి శ్రీను, సహకారంతో జరిగిన మెగా ఉచిత మెడికల్ క్యాంపు నందు 1500 వందల మందికి పైన వైద్య సేవలు అందించడం జరిగింది దీనిలో భాగంగా డాక్టర్ పిల్లా శ్రీధర్ జనరల్ మెడిసిన్ మరియు షుగర్ వైద్య నిపుణులచే దాదాపు 600 పైచిలుకు రోగులను పరీక్షించి ఉచితంగా మందులు అందించడం జరిగింది. డాక్టర్ జి లక్ష్మి స్త్రీ పశూతి వైద్య నిపుణులచే 500 పైచిలుకు స్త్రీలను పరీక్షించి ఉచితంగా మందులు అందించడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ చింతపట్ల శ్రీనివాస్ జనరల్ సర్జన్ చే 500 పైచిలుకు పేషెంట్లను పరీక్షించి ఉచితంగా మందులు అందించడం జరిగింది. ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంపు నందు బిపి షుగర్ హిమోగ్లోబిన్ పరీక్షలు ఉచితంగా నిర్వహించి నిపుణులైన డాక్టర్లచే వైద్య సేవలు అందించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంపును గొల్లప్రోలు పరిసర ప్రాంత ప్రజలే కాకుండా నియోజకవర్గ ప్రజలుకుడా ఇంచుమించు 1500 వందల మందికి పైగా వినియోగించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వెన్నపు చక్రధర్ రావు గారు, అరిపి వెంకటేష్, అరిపి శ్రీను, ఎక్స్ సర్పంచ్ గరగా సత్యనందరావు, దుడ్డు రాంబాబు, కోన రామకృష్ణ, మొయిళ్ళ నాగబాబు, మర్రి దొరబాబు, మచ్చ శ్రీనివాస్, కారపురెడ్డి వెంకటేష్, కొండపల్లి శివ, పిల్లా రమ్యజ్యోతి, గది బాబ్జి, పేకెటి దుర్గాప్రసాద్, బొజ్జ గోపి కృష్ణ, పల్నాటి మధుబాబు, వీరమరెడ్డి అమర్, కడిమిశెట్టి వెంకటేష్, రంశెట్టి సింహాద్రి మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.