ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబానికి ఆర్ధిక సాయమందించిన పితాని

ముమ్మిడివరం, జనసేన పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ళరేవు మండలం సుంకరపాలెం గ్రామపంచాయతీలో చింతాకుల వారి పేటలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు వాసంశెట్టి సూర్యనారాయణ చిత్రపటానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి 5000 రూపాయలు మరియు 50 కేజీల బియ్యం అందజేశారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి ఈ విషయాన్ని తెలియజేసి పార్టీ నుండి ఆర్థిక సహాయం అందే విధంగా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సానబోయిన మల్లికార్జునరావు, రాష్ట్ర కార్యదర్శి జక్కంశెట్టి పండు, ఉభయగోదావరి జిల్లాల కార్యదర్శి ముత్యాల జయ, తాళ్లరేవు మండల అధ్యక్షులు అత్తిలి బాబూరావు, కొంపిశెట్టి బుజ్జి, ఇళ్ల వీర, సుంకర చంద్రం, మచ్చ నాగబాబు, దూడల స్వామి, సలాది రాజా, మల్లిపుడి రాజ, కన్నీడి నాని, పితాని అర్జున్, పెనడ శ్రీనివాసరావు, బొంతు సత్యనారాయణ, చింతాకుల ఈశ్వరరావు, చీకట్ల చంద్రరావు, చింతాకుల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.