భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్ కై హామీ యాత్ర

కాకినాడ సిటి: జనసేన పార్టీ కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్ కి హామీ యాత్రా కార్యక్రమం 13వ వార్డ్ రెవిన్యూ కాలనీలో టి.వి.వి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముత్తా శశిధర్ భవన నిర్మాణ కార్మికులు అప్పన్న మరియు అక్కడున్న వారితో మాట్లాడి వారి బాగోగులను, ఆదాయ వివరాలపై ఆరాతీసారు. ఆరునెలల తరువాత ఈపని తగిలిందని అక్కడ పనిచేస్తున్న కార్మికులు చెపితే బాధని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా ముత్తా శశిధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉపాధి కోల్పోయి జీవితాలు అతలాకుతలం అయిపొతున్న వారిలో అతిపెద్ద సామాజిక వర్గం భవన నిర్మాణ కార్మికులేనన్నారు. తమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వీరికోసం గట్టిగా పోరాటం చేయడంలో ముందున్నారన్నారు. ఈ భవన నిర్మాణ కార్మికులకి ఈరోజు పని దొరికిందంటే రోబో సేండ్ పుణ్యమేనన్నారు. ప్రకృతి వరంగా దొరికే ఇసుకకి నేడు రాష్ట్రంలో కొరత రావడం ఈ వై.సి.పి ప్రభుత్వ వైఫల్యమే అనీ ఇది మన రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమన్నారు. పవన్ కళ్యాణ్ గారు తమ పార్టీ మేనిఫెస్టోలో ఇల్లు కట్టుకునే ప్రతి పేదవానికీ అందుకు అవసరమయ్యే ఇసుకని ఉచితంగా ఇస్తామని ప్రకటించారనీ చెపుతూ, దీనిని నిన్న జరిగిన తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో కమిటీలో చెప్పి ఒప్పించడం జరిగిందన్నారు. భవన కార్మికులకి మెరుగైన ఆదాయం వచ్చేలా ఇరుపార్టీలు రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చి చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తామని హామీ ఇచ్చారు. జనసేన పార్టీ ప్రతి తాపీపని, ఫ్లోరింగ్, వడ్రంగి, పెయింటింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ తదితర విభాగాల కార్మికునికీ సంవత్సరానికి 200 రోజులు పని ఉండేలా కార్యాచరణని పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేస్తున్నారని ఆయన తరపున తెలియచేసారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు ములుకి అప్పన్న, గుర్రం వీరబాబు, తాతయ్య, తంగెళ్ళ లోవ, అప్పలకొండ, సుబ్బమ్మ, అచ్చెమ్మ మరియు జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, కాకినాడ సిటి జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.