*జనసేన రామ శ్రీనివాస్ అభినందనల సందేశం
అన్నమయ్య జిల్లా రాయచోటిలో, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్ నాయకులు రామ శ్రీనివాస్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించి సుపరిపాలనకు శ్రీకారం చుట్టి నేటికి సరిగ్గా ఒక సంవత్సరం పూర్తైన సందర్భంగా ఆయన ఈ సందేశాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా రామ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, మన్ననలు పొందుతూ, గ్రామీణ భారత్ వికాసానికి విజ్ఞానశాఖల ద్వారా మార్గదర్శకుడిగా నిలిచారు పవన్ కళ్యాణ్. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రజాస్వామ్యంలో గ్రామ చైతన్యానికి బీజం వేశారు. ప్రతి ఇంటికీ తాగునీటి హామీ నెరవేర్చిన శ్రమ ఆయనది,” అని అన్నారు. ఈ ఒక్క సంవత్సరంలోనే గ్రామ స్వయం పాలనకు, పర్యావరణ పరిరక్షణకు, సాంకేతికత గ్రామాల వరకు చేరేలా చేసిన పునాది శిలను ప్రశంసిస్తూ, “అధికారాన్ని సేవగా మలచిన మన నాయకుడు పవన్ కళ్యాణ్ కి హృదయపూర్వక అభినందనలు” అంటూ రామ శ్రీనివాస్ పేర్కొన్నారు.
Share this content:
Post Comment