టెంపుల్ లోఆచార్య

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య‌’. కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ చిత్రం దాదాపు న‌ల‌బై శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకోగా కోవిడ్ 19 కార‌ణంగా ఆగిన షూటింగ్‌ను ప్రారంభించ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తుండగా ఇందులో చిరంజీవి దేవాదాయ శాఖ ఉద్యోగి పాత్ర‌లో అలరించనున్నారు. అయితే… ఈ పాత్ర ఉన్న కీలక సన్నివేశాలను ఓ పురాతన ఆలయoలో చిత్రీకరించడానికి సెట్‌ను వేయిస్తున్నార‌ట. అయితే మొదట ఈ స‌న్నివేశాల‌ను ఏదైనా గుడిలో చిత్రీకరించాలనుకున్న‌ప్ప‌టికీ ప్ర‌స్తుత ప‌రిస్థితులు దృష్ట్యా దర్శకుడు కొర‌టాల టెంపుల్ సెట్ వేయిస్తున్నార‌ట‌. అయితే ‘ఆచార్య’ షూటింగ్ ఆగ‌స్ట్‌లో మొద‌ల‌య్యే అవ‌కాశం ఉన్నట్లు స‌మాచారం.