- జాయింట్ కలెక్టర్‌కు జనసేన నాయకుల వినతి
నెల్లూరు, గ్రామాల్లో ఆధార్ కేంద్రాలను తక్షణం ఏర్పాటు చేయాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయము జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో గిరిజన సమస్యలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గిరిజనులు నివసించే ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో అట్టడుగు వర్గాలైన గిరిజనుల పట్ల చిన్నచూపు తగదని తెలిపారు. పాలకులు మారుతున్నా గిరిజనలకు మాత్రం న్యాయం జరగడం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, పవన్ యాదవ్, కలువాయి మండల నాయకులు మనోహర్, యాసిన్, వసీం తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment