ఆధార్‌-ఓటర్‌ ఐడి కార్డు అనుసంధానం అవగాహన సదస్సు

మంగళగిరి నియోజకవర్గంలోని మండల పరిషత్ కార్యాలయంలో సహాయ ఎలాక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి ఓటు హక్కు కలిగిన ప్రతీ ఒక్కరూ ఓటు ఐడి కి ఆధార్ కార్డ్ అనుసంధానం చేయవలసినదిగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సుకి నియోజకవర్గ స్థాయిలోని అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులని ఆహ్వానిచడం జరిగింది. ఈ అవగాహన సదస్సుకి జనసేన పార్టీ తరుపున మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆదేశానుసారం జనసేన పార్టీ సీనియర్ నాయకులు చిట్టెం అవినాష్ పాల్గొనడం జరిగింది.

ఈ సదస్సులో అవినాష్ మాట్లాడుతూ ఓటర్ ఐడి కి ఆధార్ అనుసంధానం చేయడం వలన ఏమైనా సైబర్ సెక్యురిటి ప్రాబ్లమ్స్ మరియు ఎటువంటి సమస్యలేమైనా వస్తాయా అని అడగడం జరిగింది.