పెద్దాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఆవిర్భావ సభ సన్నాహక సమావేశం పెద్దాపురం పట్టణం రాజుగారి వీధిలో ఉన్న మట్టే ఆదినారాయణ నాగమణి ఆర్యవైశ్య సేవా సంఘ భవనంలో కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ పెద్దాపురం నియోజకవర్గ అబ్జర్వర్లు గడసాల అప్పారావు, శ్రీమతి కిరణ్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామానికి బయలుదేరి 12వ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని ప్రతి ఇంటి ఇంటికి వెళ్లి జనసేన కార్యకర్తలు బొట్టుపెట్టి పిలిచి ఆహ్వాన పత్రికలు అందించి ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆహ్వాన పత్రిక పోస్టర్ను హలో పెద్దాపురం పిఠాపురం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గం ఇంచార్జ్ వరుపుల తమ్మయ్యబాబు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి పిట్ట జానకి రామయ్య కంచుమర్తి రాజన్న, ఉభయగోదావరి జిల్లాలో ఎన్నికలకు కన్వీనర్ కోప్పిరెడ్డి నాగబాబు, పెద్దాపురం పట్టణ అధ్యక్షులు పోలమరిశెట్టి సత్తిబాబు, 20 వార్డు కౌన్సిలర్ ఒబిలిశెట్టి గణేష్ నుకరత్నం, యువత అధ్యక్షులు తమనారా లక్ష్మణ్ దివాకర్, గౌరవ అధ్యక్షులు కటారి శ్రీనివాసరావు, సామర్లకోట మండలం యువత అధ్యక్షులు మలిరెడ్డి బుచ్చిరాజు, పెంకే వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment