ఉంగుటూరులో ఆవిర్భావ సభ సన్నాహక సమావేశం

ఉంగుటూరు, ఈ నెల 14వ తేదీన పిఠాపురం వేదికగా జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్ల నిమిత్తం ఉంగుటూరు నియోజకవర్గ ముఖ్య జనసేన నాయకులతో ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు సన్నాహక సమావేశం ఏర్పాటు చేసారు. మార్చ్ 14వ తేదీన పిఠాపురం వేదికగా భారీ స్థాయిలో నిర్వహించబోయే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభకు పెద్ధ ఎత్తున నియోజకవర్గం నుండి కార్యకర్తలంతా తరలి రావాలని ఉంగుటూరు నియోజవర్గం శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు వారి క్యాంపు కార్యాలయం నందు మార్చ్ 14వ తేదీన పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు నియోజకవర్గం తరుపున ఏర్పాట్ల నిమిత్తం ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అధ్యక్షతన నియోజకవర్గ జనసేన పార్టీ ముఖ్య నాయకులు, మండల, గ్రామాల అధ్యక్షులు, జనసైనికులు, వీర మహిళలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిధులుగా ఆర్టీసీ విజయవాడ జోనల్ ఛైర్మెన్ రెడ్డి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు నియోజకవర్గం నుండి చెయ్యవల్సిన ఏర్పాట్ల గురించి ఎమ్మెల్యే ధర్మరాజు కార్యకర్తలతో చర్చించి వారికీ పలు సూచనలు చేశారు. అనంతరం ఆవిర్భావ సభకు సంబంధించి పవన్ కళ్యాణ్, ధర్మరాజుల ఛాయా చిత్రాలతో ఏర్పాటు చేసిన కార్ స్టిక్కర్లను రెడ్డి అప్పలనాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఇరువురు నాయకులు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించి 11 ఏళ్ళు పూర్తయి 12వ సంవత్సరంలోకి పెడుతున్న శుభసందర్బంగా పిఠాపురంలో నిర్వహిస్తున్న ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో నియోజకవర్గం నుండి జనసైనికులంతా పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా కోరారు. అదేవిధంగా ఇన్నాళ్లు యుద్ధలు పోరాటాలతో కూడిన ఆవిర్భావ దినోత్సవ వేడుకలే చూశామని మొదటిసారి విజయోత్సవలతో కూడిన ఆవిర్భావ దినోత్సవ వేడుకలో ఈ ఏడాది చూడబోతున్నాం అని తెలిపారు. గత పదేళ్లుగా ఎటువంటి స్వార్థం లేకుండా రాష్ట్ర ప్రజల మేలుకోరి పవన్ కళ్యాణ్ ఎన్నో పోరాటలు చేశారని దీనిలో భాగంగానే ఎన్నో ఓటములు, అడ్డంకులు ఎదుర్కొని అయన ప్రజాల కోసం ముందుకు కదిలారని వారితో స్ఫూర్తి, ఆశయసాధనలో జనసైనికులు పదేళ్ల పాటు ఒకపక్క ప్రజలకు సేవ చేస్తూ, మరొకపక్క గత పాలకుల దాడుల గురయ్యారని అన్నారు. ఈ పోరాటాల ఫలితమే ప్రజల ఆశీర్వాదాలతో నేడు రాష్ట్ర ప్రజాల ఆకాంక్షలకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రజలు, రాష్ట్రం కోసం పనిచేసే భాగ్యం మనందరకి కలిగిందని పేర్కొన్నారు.

WhatsApp-Image-2025-03-07-at-8.16.40-PM-2-1024x576 ఉంగుటూరులో ఆవిర్భావ సభ సన్నాహక సమావేశం

Share this content:

Post Comment