ఆవిర్భావ సభ చరిత్రలో నిలిచిపోతుంది: ఎస్ కోట జనసేన నాయకులు

ఎస్ కోట నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం నియోజకవర్గ నాయకులు వి.సత్యనారాయణ, వి.సన్యాసి నాయుడు ఆధ్వర్యములో మండల పార్టీ సభ్యులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. మార్చి14న పిఠాపురం చిత్రాడలో జరగనున్న జనసేన 12వ ఆవిర్భావ సభ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. పార్టీ ఆవిర్భావం నుండి అభివృద్ధి వరకు తోడు ఉన్న ప్రతి ఒక్కరు ఈ వేడుకలలో పాల్గొని, విజయవంతం చేయాలని జనసైనికులకు, వీరమహిళలకు, మెగా అభిమానులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment