*కొత్తవలస – ఛలో పిఠాపురం
మార్చి 14న పిఠాపురంలో జరుగుతున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకు కొత్తవలస మండలం నుంచి జనసేన నాయకులు, జనసైనికులు భారీగా బయలుదేరారు. ఈ సందర్భంగా ఏస్.కోట నియోజకవర్గ జనసేన నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు మాట్లాడుతూ, “పార్టీని బలోపేతం చేయడంలో ఆవిర్భావ సభ అత్యంత కీలకంగా ఉండబోతోందని” పేర్కొన్నారు. జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి వబ్బిన సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం కొత్తవలస అంబేద్కర్ సెంటర్‌లో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జనసైనికులు, వీర మహిళలు, మెగా అభిమానులు నినాదాలు చేస్తూ “జయప్రదం చేయాలి” అని ఉత్సాహంగా ర్యాలీగా బయలుదేరారు. మీడియాతో మాట్లాడిన వబ్బిన సన్యాసి నాయుడు మాట్లాడుతూ, “పిఠాపురంలో జరుగుతున్న ఆవిర్భావ సభలో ప్రజా సమస్యలు, పార్టీ భవిష్యత్ ప్రణాళికలపై తీర్మానాలు ప్రకటించబడతాయి. 100% స్ట్రైక్ రేట్‌తో 21 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన పవన్ కళ్యాణ్ గారు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఈ సభ ఎంతో కీలకం” అని అన్నారు. ఏస్.కోట నియోజకవర్గంలోని 5 మండలాల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో 5 బస్సులు, కార్లు, బైక్‌లపై జనసేన నాయకులు, జనసైనికులు పెద్ద ఎత్తున తరలివెళ్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తవలస మండల పార్టీ నాయకులు రామదుర్గ, జిల్లా ప్రచార కార్యదర్శి మల్లువల్సా శ్రీను, యెర్రినాయుడు, గాలి అప్పారావు, కర్రి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment