ఈ ఏడాది కుళాయి పన్ను రద్దు చేయండి: దేవి హారిక

అమలాపురం: అమలాపురం మున్సిపల్ సమావేశం చైర్ పర్సన్ రెడ్డి సత్య నాగేంద్ర మణి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జనసేన కౌన్సిలర్ గండి దేవి హారిక మాట్లాడుతూ… గత కొన్ని నెలలు గా పురపాలక ప్రజలకు శుభ్రమైన త్రాగునీరు సరఫరా చేయడంలేదు అని ప్రశ్నించారు. దీని వలన ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. ఈ ఏడాది నీటి పన్ను (కుళాయి పన్ను) రద్దు చేయాలి అని కోరారు.