జనవాణిలో వినతుల స్వీకరణ

మంగళగిరి, జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో సోమవారం నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్, వీర మహిళ ప్రాంతీయ కో-ఆర్డినేటర్ శ్రీమతి కోలా విజయ లక్ష్మి, లీగల్ సెల్ ప్రతినిధి శీలం నాగ వెంకటరత్నం పాల్గొన్నారు.

Share this content:

Post Comment