మాట ప్రకారం 3వ నెల నిత్యావసరాలు అందజేసిన ప్రియా సౌజన్య

నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామంలో 5 నెలలు క్రితం జనసైనికుడు మేడపాటి దుర్గాప్రసాద్ చనిపోవడం జరిగింది. అది అందరికి తెలిసిందే ఆరోజు జనసేన పార్టి రాష్ట్ర కార్యదర్శి ప్రియా సౌజన్య ప్రతి నెల మేడపాటి దుర్గాప్రసాద్ కుటుంబానికి కావలిసిన నిత్యావసర సరుకులు ఇస్తానని చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం 3 వ నెల కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యాదర్మి ప్రియా సౌజన్య, ఉండ్రాజవరం మండల ప్రెసిడెంట్ విరమళ్ళ బాలాజీ, నిడదవోలు ఏ.ఎన్.ఆర్, సదా వెంకట్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.