చిరంజీవి బర్త్‌డే కానుకగా ‘ఆచార్య’ మూవీ మోషన్ పోస్టర్

మెగాస్టార్ చిరంజీవి 65వ పుట్టినరోజు వేడుకలలో భాగంగా ఆచార్య రూపంలో దర్శకుడు కొరటాల శివ ఓ సర్‌ప్రైజ్ ఇచ్చారు. మెగా అభిమానులంతా ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న ‘ఆచార్య’ మూవీ నుంచి, మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే కానుకగా మోషన్ పోస్టర్ విడుదల చేశారు.

శనివారం సాయంత్రం 4గంటలకు చిత్రయూనిట్ ‘ఆచార్య’ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఒక సమస్య కోసం పోరాడుతున్న యోధుడిలా ఈ పోస్టర్‌లో చిరు ఉన్నారు. అలాగే ధర్మస్థలి అనే గ్రామం చూపిస్తూ.. కొందరు పేదవారు దీనంగా చూస్తుంటే.. అన్యాయం చేసేవారిని చిరు పైలోకాలకు పంపిస్తున్నట్లుగా ఈ మోషన్ పోస్టర్‌లో చూపించారు.