ఘనంగా అచ్చిబాబు పుట్టినరోజు వేడుకలు

కొవ్వూరు నియోజకవర్గం దొమ్మేరు గ్రామంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు గంగుమళ్ల స్వామి ఆధ్వర్యంలో పెండ్యాల అచ్యుత్రామయ్య జన్మదినం ముగింపు సందర్భంగా ఆదివారము దొమ్మేరు బస్టాండ్ సెంటర్లో మజ్జిగ చలివేంద్రము మరియు అంధులు, వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మజ్జిగ చలివేంద్రంని తెలుగుదేశం పార్టీ టూ మెన్ కమిటీ సభ్యులు కంఠమణి రామకృష్ణ ప్రారంభించారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు గంగుమళ్ళ స్వామి అచ్చిబాబుకి శుభాకాంక్షలు తెలుపుతూ కొవ్వూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ రథసారథి, విజయ సారధి ఆంధ్ర సుగర్స్ ఎండి పెండ్యాల అచ్యుతరామయ్య(అచ్చిబాబు) నిండు నూరేళ్లు పూర్తి అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని జనసేన పార్టీ తరఫున అచ్చిబాబు మీద ఉన్న అభిమానంతో ఈ యొక్క సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ టూ మాన్ కమిటీ సభ్యులు కంటమణి రామకృష్ణ, కొవ్వూరు టౌన్ ప్రెసిడెంట్ దాయన రామకృష్ణ, కొవ్వూరు నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్ నాయకులు గంగుమళ్ల స్వామి, దొమ్మేరు గ్రామ వైస్ ప్రెసిడెంట్ సుబ్బారావు, కలగర రంగారావు, గారపాటి రామకృష్ణ, భుజంగం తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment