‘సర్కారు వారి పాట’లో యాక్షన్‌ కింగ్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా బ్యాకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్షిక కుంభకోణాల నేపథ్యంలో రూపొందుతోంది. దుబాయ్‌లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలో కొత్త షెడ్యూల్ మొదలవబోతోంది. కాగా ఇందులో యాక్షన్‌ కింగ్ అర్జున్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో ఈ సినిమాలో ఆయనే విలన్ అనుకున్నారు. కానీ ఈ సినిమాలో ఆయన విలన్ కాదట .. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని అంటున్నారు. గతంలో అర్జున్ పోలీస్ ఆఫీసర్ గా చేసిన చాలా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అదే విధంగా ఈ సారి కూడా ఆయన మంచి మార్కులు కొట్టేయడం ఖాయమే. త్వరలో దీనిపై మరింత క్లారిటీ రానుందని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్,14 రీల్ ఎంటర్టైన్మెంట్స్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో, కథానాయికగా కీర్తి సురేశ్ అలరించనున్న సంగతి తెలిసిందే.