వైసీపీ నాయకులకు కొమ్ము కాస్తున్న అధికారులపై చర్య తీసుకోవాలి: శివరామకృష్ణ

నూజివీడు: పాత రావిచేర్ల గ్రామంలో జగనన్న ఇళ్ళ పథకంలో ఇళ్ల లబ్ధిదారులు, వైఎస్సార్సీపీ నాయకులు కేటాయించిన స్థలాల్లో ఇళ్ళ నిర్మాణం చేస్తూ పక్కనే ఉన్నరహదారి ఆక్రమణ చేసిన వారికి అధికారులు కొమ్ము కాస్తున్నారని వారిపై వెంటనే చర్య తీసుకోవాలని కోరుతూ నూజివీడు మండలం, పాత రావిచేర్ల సచివాలయం వద్ద ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధికార ప్రతినిధి శివరామకృష్ణ మాట్లాడుతూ.. 3 వ తారీఖున పాత రావిచర్ల లో వైఎస్సార్సీపీ ఈ సమస్యపై ఎం ఆర్ ఓ, ఎంపిడిఓ కి వినతిపత్రాలు ఇస్తే ముడు రోజుల్లో సర్వే చేసి చర్య తీసుకుంటాము అని చెప్పారు అన్నారు..సోమవారం 4 గంటలకు సర్వే కి ఆర్.ఐ వస్తున్నారు అని రైతులను ప్లాట్ లు వద్దకు వెళ్లామని చెప్పితే రైతులు అందరూ అక్కడ గంటపైన వేచి చూస్తుంటే మళ్ళీ రావడం లేదు అని వి ఆర్ ఓ తో సమాచారం ఇచ్చారని ఇవి అన్నీ ఎవ్వరూ వెనుక ఉండి చేస్తున్నారు అన్నారు. గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకుల అరాచకం, ఆగడాలు ఎక్కువ అయ్యాయి అన్నారు. గ్రామంలో కొండలు, గుట్టలు ఆక్రమించుకోవడం, బి ఫారం ఉన్న వాళ్ళని బెదిరించి డబ్బు అడగటం, సంక్షేమ పథకాల్లో అవినీతి, కాల్ మని కేసులు, రహదారులు ఆక్రమణ అన్నిటిలో వీళ్ల పాత్ర ఉంటుంది అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమాల పరమావధిగా బతుకుతున్నారనీ విమర్చించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నూజివీడు మండలం కార్యదర్శి చెరుకుపల్లి కిషోర్, తోట. మల్లి, గ్రామ రైతులు చీకటి. ప్రసాద్, తోట.శ్రీను, నరహరసెట్టి వీరబాబు, చిన్నం సంబయ్య, జమలయ్య, వెలివెల బసవరాజు, వెంకట్రావు, రామకృష్ణ, దుద్దూకురి రాంబాబు, చిన్నం అనిల్, జనసేన పార్టీ నాయకులు అంజిబాబు, కోన్నంగుంట రాంబాబు, తోట బలరామ్, కస్తూరి అశోక్, పసుపులేటి నాగు తదితరులు పాల్గొన్నారు.