అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి

శేరిలింగంపల్లి నియోజకవర్గం: శేరిలింగంపల్లి పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలకు కనీస వసతులు లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు వర్ణణాతీతం, మరియు మధ్య తరగతి ప్రజలు కార్పొరేట్ విద్యను కొనలేక ప్రభుత్వ పాఠశాలలలో వారి పిల్లలను చదివించడానికి ముందుకు రావడం చాలా గొప్ప పరిణామం, కానీ ప్రభుత్వం వారు విదార్ధులకు అవసరమైన పాఠ్యా పుస్తకాలు సకాలంలో అదించలేక పోవడం వలన పాఠశాలలలో చదువుకునే విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అటు మౌలిక సదుపాయాలు లేక పాఠ్యా పుస్తకాలు సకాలంలో అందక ప్రైవేట్ ఫీజులకు మద్య తరగతి ప్రజల జేబుకు చిల్లు పడుతున్నాయి. కావున ప్రభుత్వం వారు తక్షణమే సకాలంలో విద్యార్థులందరికీ పాఠ్యా పుస్తకాలు అందించి అన్ని ప్రభుత్వ పాఠశాలలలో తగిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ తరపున డాక్టర్ మాధవ రెడ్డి రంగారెడ్డి డిమాండ్ చేశారు. కావున మీరు తగిన చర్యలు చేపట్టే విధంగా వెనువెంటనే ఆదేశాలు జారీ చేయవలసిందిగా, శేరిలింగంపల్లి నియోజకవర్గ జనసేన ఇన్చార్జి డాక్టర్ మాధవ రెడ్డి రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ తిరుపతిరావు గారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకులు అరుణ్ కుమార్, కళ్యాణ్ చక్రవర్తి, హనుమంతు నాయక్, పవన్ ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.