క్రియాశీలక సభ్యత్వ అవగాహన కార్యక్రమం

పామర్రు నియోజకవర్గం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు మూడవ విడత జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ ప్రచార కార్యక్రమం కృష్ణాజిల్లా, పామర్రు నియోజకవర్గం, పామర్రు టౌన్ లో మొదట రోజు పామర్రు నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈ సందర్భంగా పామర్రు నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ తాడిశెట్టి నరేష్ మాట్లాడుతూ.. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం జనసైనికులు, వీరమహిళల భద్రతతో పాటు వారి కుటుంబాలకు కొండంత భరోసా ఇస్తుంది. పార్టీ కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా భావించే ఏకైక నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. వారికి ఎలాంటి ఆపద వచ్చినా ఆయన చలించిపోతారు. పార్టీ కార్యకర్తలు, వారి కుటుంబాల్లో భరోసా నింపే క్రమంలో రెండేళ్ల క్రితం క్రియాశీలక సభ్యత్వ ప్రక్రియ ప్రారంభించారు. దేశంలో మరే రాజకీయ పార్టీ చేయని, చేయలేని కార్యక్రమం ఇది. దేశ చరిత్రలో కార్యకర్తలకు రూ. 5లక్షల ప్రమాద బీమా, రూ. 50 వేల మెడికల్ ఇన్సూరెన్స్ ఇస్తున్న ఏకైక పార్టీ జనసేన పార్టీ మాత్రమే. దశాబ్దాల తరబడి అధికారాన్ని అనుభవించిన పార్టీలు కూడా రూ. లక్ష – రూ. 2 లక్షలు ఇచ్చి సరిపెడుతుంటే, శ్రీ పవన్ కళ్యాణ్ గారు బీమా కంపెనీలను ఒప్పించి పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఒక భరోసా నింపే కార్యక్రమం చేపట్టారు. దురదృష్టకర సంఘటనలు జరిగినప్పుడు కుటుంబ పెద్దను కోల్పోయి, కొడుకుల్ని కొల్పోయి ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు ఆసరాగా నిలిచేందుకే ఈ కార్యక్రమం. గడచిన రెండేళ్లలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో క్రియాశీలక సభ్యత్వం తీసుకుని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయిన పదుల సంఖ్యలో కుటుంబాలను ఆదుకున్నారు. వారిలో ఒక భరోసా నింపగలిగారు. ప్రతి ఇంటికీ పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, ఆయా జిల్లాల నాయకత్వాన్ని వెంట తీసుకుని వెళ్లి ఆ మొత్తాన్ని అందించి, మీకు జనసేన పార్టీ అండగా ఉందన్న భరోసా నింపారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన జనసేన క్రియాశీలక సభ్యులు చనిపోగా, వారికి గత ఏడాది జరిగిన విశాఖ పర్యటనలో స్వయంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు రూ. 5లక్షల చెక్కలు అందచేశారు. జనసేన పార్టీ సభ్యులు అంటే ప్రతి ఒక్కరిలో ఒక ధీమా నింపే విధంగా ఈ క్రియాశీలక సభ్యత్వం తీసుకువచ్చారు. క్రియాశీలక సభ్యులు చెల్లించిన మొత్తానికి తన సొంత సంపాదన నుంచి మరికొంత బీమా కంపెనీకి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెల్లిస్తున్నారు. కార్యకర్తల క్షేమం కోసం ఈ స్థాయిలో ఆలోచించే నాయకుడు మన రాష్ట్రంలోనే కాదు దేశంలో మరెవరూ లేరు. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి మూడవ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇప్పటికే సభ్యత్వం తీసుకున్న వారు రూ. 500 చెల్లించి దాన్ని రెన్యువల్ చేయించుకోవాలని కోరుతున్నాం. కొత్తగా పార్టీలో చేరిన వారితో పాటు జనసేన సానుభూతి పరులు ఎవరైనా క్రియాశీలక సభ్యత్వం స్వీకరించ వచ్చు.
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి? ప్రతి జనసైనికుడు, వీరమహిళ క్రియాశీలక సభ్యత్వం ఎందుకు తీసుకోవాలి? అనే అంశాలపై పార్టీ ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి వారం రోజుల పాటు ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించాలని నిర్ణయించాం. మొదటి రోజు పామర్రు పట్టణ పరిధిలో జనసేన క్రియాశీలక సభ్యత్వ అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. శ్రీ పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుడు వస్తేనే రాష్ట ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రతి ఒక్కరు జనసేన సభ్యత్వం తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా పామర్రు నియోజకవర్గ ప్రజానీకాన్ని కోరుతున్నామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పామర్రు మండల అధ్యక్షులు గుంపు గంగాధరరావు, తోట్లవల్లూరు మండల అధ్యక్షులు శనివారపు కృష్ణ సుమన్, జిల్లా కమిటీ సభ్యులు కాకి ఝాన్సీ, అంబటి రాజలక్ష్మి, కృష్ణా జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యులుశ్రీ పచ్చి గొల్ల సుధీర్ బాబు, కాకర్ల దుర్గాప్రసాద్ (ఐ.టి), పామారు మండల మరియు పమిడి మొక్కల మండల ప్రధాన కార్యదర్శిలు గూడవల్లి వీరబాబు, ఎర్రంశెట్టి వీరాస్వామి, పామర్రు నియోజకవర్గ జనసేన నాయకులు పోలిశెట్టి నవీన్, ఏనుగు వెంకటరత్నం, కాకర్ల చైతన్య, పామర్రు నియోజకవర్గ జనసేన పాల్గొన్నారు.