దోమకొండ అశోక్ ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు

విజయవాడ, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ యువ నాయకులు దోమకొండ అశోక్ ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గం 7వ డివిజన్, 5వ నంబర్ రూట్ లో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా దోమకొండ అశోక్ మాట్లాడుతూ దేశంలోనే ఏ రాజకీయ పార్టీ ఇవ్వని విధంగా జనసేన పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు, వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇస్తూ వారి కుటుంబ సభ్యులకు పెద్దన్నల నిలబడుతున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి 2024లో ఒక అవకాశం ఇవ్వాలని, జనసేన పార్టీకి మీ ఆశీస్సులు కావాలని, క్రియాశీలక సభ్యత్వం తీసుకుని జనసేన పార్టీలో భాగస్వాములు కావాలని ప్రజలను కోరడం జరిగింది. ఈ సందర్భంగా 7వ డివిజన్ లోని ప్రజలు, జనసేన పార్టీ మద్దతుదారులు పెద్ద ఎత్తున క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో 8వ డివిజన్ అధ్యక్షులు మట్టా వివేక్, 8వ డివిజన్ ఉపాధ్యక్షులు అనిల్, 7వ డివిజన్ కమిటీ సభ్యులు బండి ప్రదీప్, పెందుర్తి విజయ్ కుమార్, భాస్కర్, సాదిరెడ్డి శ్రీను, గుత్తవల్లి పవన్, సూరి జనసేన పార్టీ 7వ డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.