క్రియాశీలక సభ్యత్వం జనసైనికులకు భద్రతనిస్తుంది: బలిజ కోటేశ్వరరావు

అరకు నియోజకవర్గం: హుకుంపేట మండలం, రాఫా పంచాయతీ కె.తాడిపుట్టు గ్రామంలో జనసేన క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీలో భాగంగా జనసైనికులతో అరకు నియోజకవర్గ నాయకులు బలిజ కోటేశ్వరరావు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కోటేశ్వరరావు మాట్లాడుతూ మేము చేసిన క్రియా శీలక సభ్యత్వం మండల జనసైనికులకు గొప్ప భద్రతనిస్తుందని, ఏ పార్టీలో లేనటువటువంటి భీమా సౌకర్యం తన అభిమానులకు జనసైనికులకు కలిపించాలని జనసేనాని తలిచిన గొప్ప ఆలోచన ఇచ్చిందని అన్నారు. అలాగే ఎన్నో సేవకార్యక్రమలు చేస్తూ అధికారంలో లేకున్నా కూడా 30 కోట్ల రూపాయలతో కౌలు రైతులకు ఆదుకున్న మహావ్యక్తియని అటువంటి నిజాయితీ గలా నాయుడిపై పదవులున్నదనే అహంతో ఆరోపణలు చేస్తున్న మార్పు కొరకు సర్వశక్తులతో వచ్చే ఎన్నికలకు సిద్ధపడుతున్నారని అన్నారు. నాకు తెలిసి గిరిజన బ్రతుకులు మారాలంటే జనసేన పార్టీతోనే సాధ్యమని బలంగా విశ్వసిస్తున్నామని, అందుకే జనసేన పార్టీ ద్వారా సిద్ధాంతాలకు కట్టుబడి మార్పు కోసం మా వంతు శక్తి వంచన లేకుండా గ్రామస్థాయి పర్యటన చేస్తున్నామని అందులో భాగంగా ఈ క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బూడిద నాగరాజు, పార్లమెంట్ వర్కింగ్ కమిటీ సభ్యులు జన్ని కొండబాబు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక జనసైనికులు జన్ని లింగన్న, జన్ని సతీష్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.