బూర్జ మండలంలో క్రియాశీల సభ్యత్వం కిట్ల పంపిణీ కార్యక్రమం

శ్రీకాకుళం జిల్లా, ఆమదాలవలస నియోజకవర్గం, బూర్జ మండలంలో జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం.. కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరరావు అధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జనసేన పార్టీ స్టేట్ సెక్రెటరీలు బేతపూడి విజయ్ శేఖర్, అంగ దుర్గా ప్రశాంతి, జాయింట్ సెక్రెటరీ తాడి మోహన్, ఆమదాలవలస నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు, జనసేన ఎంపిటిసి అంపిలి విక్రమ్ చేతుల మీదుగా క్రియాశీలక సభ్యత్వం చేసిన వాలంటీర్లకు సన్మానం మరియు క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు క్రియాశీలక సభ్యత్వం కిట్లు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో.. ఆమదాలవలస నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినటువంటి బూర్జ మండలం జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదములు తెలియచేయడం జరిగింది.