జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం – భద్రమైన భవితవ్యం

  • జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమ సమీక్షా సమావేశం

అనంతపురం జిల్లా, గుంతకల్ నియోజకవర్గం, పామిడి మండలంలో జనసేన పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు టి.సి వరుణ్ ఆదేశాలతో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి వాసగిరి మణికంఠ అధ్యక్షతన, జనసేన పార్టీ పామిడి మండల అధ్యక్షుడు ధనుంజయ ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి జనసేన పార్టీ పామిడి మండల నాయకులు, జనసైనికులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా వాసగిరి మణికంఠ మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధ్యక్షులు జనసేనాని శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల శ్రేయస్సు కోసం ఎంతో ఆలోచించి చేపట్టినటువంటి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని కార్యకర్తలకు మరింత చేరువ చేస్తూ, ప్రతి ఒక్క కార్యకర్త క్రియాశీలక సభ్యత్వం చేయించుకునేలా, వారికి క్రియాశీలక సభ్యత్వం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించి, పవన్ కళ్యాణ్ గారి సంకల్పానికి బలం చేకూర్చేలా కలసికట్టుగా పని చేసుకుంటూ ముందుకు వెళ్లాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా పని చేయాలని, జనసేన పార్టీలో నాయకులు కార్యకర్తలు అనే భేదభావం ఉండదని ప్రతి ఒక్కరు పార్టీ కోసం పనిచేసే నిస్వార్థ సైనికులు మాత్రమే అని, జనసేన పార్టీ కార్యకర్తలకు అండగా ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల శ్రేయస్సే, జనసేన శ్రేయస్సుగా భావిస్తారని తన కార్యకర్తల కోసం ఎందాకైనా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటారని మనం కూడా అలాగే అందరం కలిసికట్టుగా జనసేనాని ఆశయ సాధన కోసం పని చేద్దామని తెలియజేశారు.. జనసేన పార్టీ పామిడి మండల అధ్యక్షులు ధనుంజయ మాట్లాడుతూ ఇక మిగిలి ఉన్నది రెండు రోజులే కాబట్టి కచ్చితంగా ప్రతి కార్యకర్తకు క్రియాశీలక సభ్యత్వాన్ని చేయించేలా అందుకు అనుగుణంగా ఈ రెండు రోజులు పూర్తి సమయాన్ని కేటాయించి పనిచేయవలసిందిగా మండల నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, సూచించారు, కార్యకర్తలకు క్రియాశీలక సభ్యత్వాన్ని చేయించడం ద్వారా జనసేన పార్టీ సత్తా తెలియజేయాలని, క్రియాశీలక సభ్యత్వం చేయించుకున్నటువంటి కార్యకర్తలకి రానున్న రోజుల్లో పార్టీ పదవులు అందుతాయని, మనం చేసే ప్రతి పనిలో పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలోపెట్టుకుని కలిసికట్టుగా పని చేసుకుంటూ ముందుకు వెళ్దామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గుత్తి మండల అధ్యక్షులు శ్రీ చిన్న వెంకటేశ్వర్లు మరియు గుంతకల్లు చిరంజీవి యువత అధ్యక్షులు పాండు, జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, జనసేన పార్టీ మండల కార్యదర్శి రామాంజనేయులు, సూర్యకుమార్, లాలుస్వామి, పెన్న ఓబులేసు, ఖాజావలి, తాడిపత్రి సిద్దు, సురేష్, రోషన్ జమీర్, భాస్కర్ గౌడ్, ధన, అబ్దుల్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.