ముత్తుకూరులో క్రియాశీలక సభ్యత్వ నమోదు

సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆదివారం సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంటే ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా గాని ఇప్పటివరకు ఆ పార్టీల జెండాలు మోసేటటువంటి కార్యకర్తల గురించి గానీ నాయకులు గురించి వారి కుటుంబాల గురించి ఆలోచించి రక్షణ కల్పించినటువంటి పరిస్థితులు లేవు మా అధినేత పవన్ కళ్యాణ్ ఏదైతే జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తూ జనసేన జెండాని భుజాన వేసుకొని మోస్తున్నటువంటి జనసేన కార్యకర్తలు జనసైనికులు వీర మహిళల కుటుంబాల రక్షణ కోసం క్రియాశీలకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మూడో విడత కొనసాగిస్తున్నారు క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతి సభ్యుడికి జనసేన పార్టీ అండగా ఉంటుంది అదేవిధంగా 5 లక్షల రూపాయలు యాక్సిడెంటు బెనిఫిట్ 50వేల రూపాయలు వైద్య నిమిత్తం వినియోగించుకునే విధంగా క్రియాశీలక సభ్యత్వాన్ని పార్టీ జెండా మోసే కార్యకర్తలు కుటుంబాలకు రక్షణ కవచం లాగా కొనసాగిస్తున్నారు సభ్యత్వాన్ని ఈనెల 28వ తారీకుతో ముగిస్తుంది కాబట్టి సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రతి ఒక్క జనసైనికుడు పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన నాయకులు వీర మహిళలు అందరు కూడా సద్వినియోగం చేసుకుంటారని పార్టీలో భాగస్వాములు అవుతారని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం, ఐటీ వింగ్ విభాగం అభిషేక్, చిన్న, శ్రీహరి, రహమాన్, తేజ తదితరులు పాల్గొన్నారు.