క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. రాటాల రామయ్య

రాజంపేట మండలంలోని ప్రతి ఒక్క జనసేన కార్యకర్త, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం, ఈ మేరకు రాజంపేట అసెంబ్లీ జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ సూచనల మేరకు జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఫిబ్రవరి 10వ తేదీ నుండి 28వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పేర్కొన్నారు. బుధవారం రాజంపేట పట్టణంలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య మాట్లాడుతూ… జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే ప్రతి ఒక్కరూ, సభ్యత్వం తీసుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. దేశ రాష్ట్ర రాజకీయ పార్టీలో ఎక్కడా లేనివిధంగా కార్యకర్తల బాగోగులు గురించి ఆలోచించే పార్టీ జనసేన పార్టీ క్రియాశీలకంగా పార్టీలో కష్టపడే కార్యకర్తలకు ప్రమాదవశాత్తు ఏదైనా ఆపదలు వస్తే వారి కుటుంబానికి ఆదుకునే విధంగా ప్రమాద భీమా రూ.50 వేలు, 5 లక్షల రూపాయల ప్రమాద బీమాలను అందించిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. గత 2021,2022 సంవత్సరంలో 3లక్షల 50 వేలకు పైగా జనసేన పార్టీలోకి క్రియాశీలక సభ్యులకు సభ్యత్వం అందించారని అదేవిధంగా మూడో విడతలో భాగంగా 2023 సంవత్సరంలో 5 లక్షల పైగా సభ్యులకు జనసేన క్రియాశీలక సభ్యత్వం అందించాలన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడుతూ, క్రియాశీలకంగా పనిచేసిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు అందరూ, కలిసికట్టుగా జనసేన క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని రాటాల రామయ్య అన్నారు. ఈ కార్యక్రమంలోలీగల్ సెల్ కత్తి సుబ్బరాయుడు, జనసేన యువ నాయకుడు పోలిశెట్టి శ్రీనివాసులు, తాళ్లపాక శంకరయ్య, భాస్కర్ పంతులు, వీరాచారి, వెంకటయ్య, గోపి తదితరులు పాల్గొన్నారు.