ఆపత్కాలంలో కార్యకర్తలకు అండగా నిలిచేందుకే క్రియాశీలక సభ్యత్వం: దేవా గౌడ్ ప్రసాద్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండలంలో క్రియాశీలక సభ్యత్వం గురించి ప్రజలలో చైతన్యం తేవాలని.. ప్రతి ఒక్క అభిమాని జనసేన క్రియాశీలక సభ్యులుగా చేరాలని జనసైనికుడు దేవా గౌడ్ ప్రసాద్ లక్ష్యంగా చేసుకుని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్తూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రజలకు జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా జనసేన క్రియాశీలక సభ్యత్వం వలన కలిగే ప్రయోజనాలను వివరిస్తూ, ప్రతి అభిమాని సభ్యత్వం తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఆపత్కాలంలో కార్యకర్తలకు అండగా నిలిచేందుకే క్రియాశీలక సభ్యత్వం అని తెలియజేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్త దేవా మరియు ప్రసాదు మరి కొంత మంది కార్యకర్తలు పాల్గొన్నారు.