కార్యకర్తలకు ఎటువంటి ఆపద వచ్చినా ముందుంటా: బొర్రా వెంకట అప్పారావు

సత్తెనపల్లి నియోజకవర్గం జనసేన నాయకులు బొర్రా వెంకట అప్పారావు గుండ్లపల్లి గ్రామంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా నకరికల్లు మండల జనసేన వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నాగుర్ వలి ఆహ్వానం మేరకు బొర్రా వెంకట అప్పారావు నాగుర్ వలి గృహమునకు వెళ్లడం జరిగింది. అనంతరం గుండ్లపల్లి గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త చెప్పరపు శ్రీనివాసరావు కు 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుండ్లపల్లి గ్రామంలో నాయకులకు, కార్యకర్తలకు ఎటువంటి ఆపద వచ్చినా ముందుంటానని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ మరింత బలోపేతం అవుతుందని, ప్రతి ఒక్క కార్యకర్త పవన్ కళ్యాణ్ కోసం కష్టపడాలని, గుండ్లపల్లి గ్రామంలో ఏ కార్యకర్తకైనా కష్టం వచ్చిందంటే అర్ధరాత్రి అయినా సరే నేను మీ అందరికీ అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కోమ్మిశెట్టి సాంబశివరావు, నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నాగుర్ వలి, షేక్ రఫీ, తెలిపారు, ముప్పల మండలం అధ్యక్షులు సిరిగిరి పవన్ కుమార్, సత్తెనపల్లి రూరల్ మండలం నాదెండ్ల నాగేశ్వరరావు సత్తెనపల్లి జనసేన పార్టీ వీర మహిళలు నామాల పుష్పలత, అమ్మిశెట్టి శిరీష, గుండ్లపల్లి గ్రామం జనసేన పార్టీ నాయకులు ఉదారపు చినరాజు, ఏపూరి చిన్న రంగారావు, నక్క వెంకటేశ్వర్లు, ఎక్కల దేవి గాంధీ, షేక్ మస్తాన్ వలి, ఏపూరి నవీన్, వరికుటి కృష్ణ, దూదేకుల సైదు మస్తాన్, ఏపూరి హరీష్, షేక్ కాలేషావలి, దూదేకు సైదులు తదితరులు పాల్గొన్నారు.