జనసేన బలోపేతం దిశగా కార్యాచరణ

  • జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తో తిరుపతి నియోజకవర్గానికి చెందిన పలువురు జనసైనికుల “మార్నింగ్ మీట్”

తిరుపతి: జనసేన పార్టీని తిరుపతి నియోజకవర్గంలో బలోపేతం చేయాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ పిలుపునిచ్చారు. “మార్నింగ్ మీట్” లో భాగంగా తిరుపతి నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు ఆదివారం ఆయనతో భేటీ అయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో ప్రతి ఒక్క జనసైనికుడు యాక్టివ్ కావాలని ఆయన కోరారు. నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, దొంగ ఓట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరారు. “మార్నింగ్ మీట్” పేరుతో ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశం అవుతున్నామన్నారు. జిల్లాలో అన్ని స్థానాల్లో జనసేన టిడిపి ఉమ్మడి అభ్యర్థులు విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.