త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తా: భవానీ రవికుమార్

అనంతపురం నియోజకవర్గం: అనంతపురం అర్బన్ జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భవానీ రవికుమార్ మాట్లాడుతూ అనంతపురం అర్బన్ లో జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా మరియు జనసేన పార్టీ ప్రభుత్వంలోకి వస్తే వాటి ప్రయోజనాలను, అభివృద్ధి పనులు అనంతపురం ప్రజలకు తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను జనసేన పార్టీ సిద్ధాంతాలను అలాగే పార్టీ ప్రారంభం నుంచి నేటి వరకు జనసేన పార్టీ చేసిన కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పెద్దల సహకారం, ఆలోచనలతో వారి సూచనల మేరకు అతి త్వరలో ఒక ప్రణాళిక బద్ధంగా చేపట్టబోయే కార్యాచరణను ప్రజలకు అనుగుణంగా ప్రకటిస్తామని భవానీ రవికుమార్ తెలిపారు.