కార్మికుల డిమాండ్లకు ఆదాని పోర్ట్ రాతపూర్వక హామీ

గాజువాక నియోజకవర్గం, గంగవరం, ఆదాని పోర్ట్ యాజమాన్యంతో ముగిసిన అఖిలపక్ష సమావేశంలో ముఖ్య పాత్ర పోషించిన 64వార్డ్ జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి. గంగవరం ఆదానీ పోర్ట్లో జరిగినటువంటి గంగవరం నిర్వాసిత పోర్ట్ ఎంప్లాయిస్ పెట్టిన డిమాండ్లపై జనసేన పార్టీ తరఫున గళం విప్పి యాజమాన్యంతో చర్చలు జరిపి హామీ తీసుకోవడంలో ముఖ్యపాత్ర పోషించినటువంటి 64వ జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డికి గంగవరం ఆదాని పోర్ట్ యాజమాన్యం సానుకూలంగా స్పందించడం జరిగింది. మే 31వరకు సమయం అడిగిన పోర్ట్ యాజమాన్యం వీలైనంతవరకు మంచి స్థాయిలో జీతాలు పెంచుతామని గంగవరం ఆదాని పోర్ట్ యాజమాన్యం చెప్పడం జరిగింది. విధుల నుండి తొలగించిన కార్మికులను త్వరలో చేర్చుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. కార్మికుల యొక్క డిమాండ్లన్నీ రాతపూర్వకంగా ఇవ్వడానికి ఒప్పుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో గంగవరం ఆదాని పోర్ట్ కార్మికులకు మంచి జరగాలని కోరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గంగవరం పోర్ట్ నిర్వాసిత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.