ప్రత్తిపాడు నియోజకవర్గం, శంఖవరం మండలం, పెదమల్లాపురం పంచాయతీ పరిధిలో గల సిద్దివారిపాలెం, శృంగధార, యరకపురం, అంకంపాలెం, పెదమల్లాపురం రెవెన్యూ పరిధిలోగల కొండపోడు పట్టాలు కలిగి పాసుపుస్తకములు కలిగి ఉన్న కాని ఖాతాలు నెంబర్లు కలిగి ఉన్నా కాని లభిదారులకు సంబందించి మీ భూమి ఆన్లైన్లో కనిపించకపోవడంతో ఆందోళన చెంది ఆయా గ్రామాల మహిళ, పురుష రైతులు సోమవారం శంఖవరం మండల తహశీల్దారుకి ఫిర్యాదు చేయుట గూర్చి ధరాఖాస్తుతో తహసీల్దారు కార్యాలయానికి వచ్చి సుమారు 100 మంది బాధితులు పిర్యాదు చేయడం జరిగినది. ఈ విషయమై ఫిర్యాదుదారులకు తహసీల్దారు వ్యక్తిగతంగా ఎవరికి వారు దరఖాస్తులు చేసుకోమని చెప్పడం జరిగినది. అనంతరం దరఖాస్తుల పరిశీలించడం వారి పూర్వం రికార్డులు ప్రకారం వారి భూములను వారి పేరన తప్పక ఆన్లైన్ చేయడం జరుగుతుందని తహశీల్దారు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా టెలికమ్యూనికేషన్స్ సలహమండలి సభ్యులు మేకల కృష్ణ, శంఖవరం మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తలపంటి అప్పారావు(బుజ్జి), దక్షణ మద్య రైల్వే వినియోగదారులు సలహమండలి సభ్యులు గోర్లి నాగేశ్వరరావు, జర్తా సరస్వతి, లోతా వెంకటరమణ, ఆవూరి నాగేశ్వరరావు, బొపల్లి రాజ్ కూమార్, ఆవూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment