దేశ చరిత్రలో నిలచిపోయే రివర్స్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి: మదనపల్లె జనసేన

*మదనపల్లె జనసేనలో చేరికలు

మదనపల్లె, దేశ చరిత్రలో ఉద్యోగుల జీతాలు తగ్గించి చరిత్రలో నిలచిపోయిన రివర్స్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని జనసేన పార్టీ రాయలసీమ కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్, చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర విమర్శించారు. ఉద్యోగులు రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలపడం చాలా బాధ కలిగించిందని శుక్రవారం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో గంగారపు రామదాస్ చౌదరి తోపాటు జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్, జనసేన పార్టీ చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, పద్మశ్రీ టైగర్, ఫాజిల్, తోట కళ్యాణ్, జగదీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగారపు రామదాస్ చౌదరి మాట్లాడుతూ ఉద్యోగులను కించపరిచే మాటలు, బెదిరించే ధోరణిని మానుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ఉద్యోగుల నిరసనకు జనసేన పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్ విధానం రద్దు చేస్తా అని ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులను నట్టేట ముంచడం జరిగిందని వివరించారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా జీతాలు తగ్గించి రివర్స్ జీతాలు చేసిన ముఖ్యమంత్రి చరిత్రకు ఎక్కడని ఎద్దేవా చేశారు. నాడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచుతామని హామీ ఇచ్చిన వైసీపీ ఇప్పుడు మాట తప్పింది. ఆనాడు ఉద్యోగులకు హామీ ఇచ్చిన నాయకులు ఈనాడు మాట మార్చడం సబబు కాదు. అధికారంలోకి రావడానికి ఒక మాట, అధికారంలోకి వచ్చాకా మరో మాట మాట్లాడం మోసపూరిత చర్యగా అభివర్ణించారు.

మదనపల్లె జనసేన పార్టీలో 50 మంది యువకులు రాయలసీమ కోకన్వీనర్ రామదాసు చౌదరి సమక్షంలో చేరడం జరిగింది. పవన్ కుమార్ టీం మరియు జనార్దన్ టీం. ఈ సందర్భంగా రామదాసు చౌదరి మాట్లాడుతూ మీ చేరికతో మాకు కొండంత బలం తోడయిందని, మన సమిష్టి కృషితో 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన జండా మదనపల్లెలో ఎహరవేయడం ఖాయమని తెలియజేస్తూ చేరిన ప్రతి ఒకరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.