తీర ప్రాంత ప్రజలకు అందని దాక్షాగా వైద్య సేవలు

పెడన నియోజకవర్గం: పెడన నియోజవర్గానికి తీర ప్రాంతాలైన కృత్తివెన్ను మండలం, బంటుమిల్లి మండలాలకు వైద్య సేవలు అందించే చినపాండ్రక ఆసుపత్రిలో వైద్య నిపుణులు కొరతతో ప్రజలకు సరిగా వైద్య సేవలు అందక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఆస్పత్రి నిర్మాణ దశ నుండి అనేక అవంతరాల మధ్య ఎట్టకేలకు అప్పటి మంత్రిగా ఉన్న పేర్ని నాని మరియు స్థానిక శాసనసభ్యుడు జోగి రమేష్ కోవిడ్ సమయంలో కోవిడ్ ఆసుపత్రిగా ప్రారంభించారు. తదనంతరం 30 పడకల ఆసుపత్రిగా వైద్య సేవలు అందిస్తుందని అనేక వాగ్దానాలు ఇచ్చారు. ఈ రెండు మండలాల ప్రజలు ఏదైనా ఆరోగ్య సమస్య లేదా ప్రమాదం ఏర్పడినప్పుడు వైద్య సేవలకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మచిలీపట్నం నీకో, మరో ప్రాంతానికో వెళ్ళవలసి వస్తుంది. మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు అనేకం. ఇటీవలే ఒక వ్యక్తికి పాముకాటు గురైతే సరైన వైద్యం అందించకపోవడంతో మచిలీపట్నానికి వెళ్లడం జరిగింది. అదృష్టవశాత్తు ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డాడు. వైసిపి ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలుగా వైద్య రంగాన్ని పూర్తిగా విస్మరించింది. ఇప్పటికైనా వైద్య శాఖ అధికారులు స్పందించి ఆసుపత్రిలో పూర్తిస్థాయి వైద్య సిబ్బందిని నియమించవలసిందిగా జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము. జనసేన పార్టీ నుండి చిలపాండ్రక ఆసుపత్రిని సందర్శించి అక్కడ పరిస్థితులను తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెడన జనసేన నాయకులు ఎస్ వి బాబు, కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తిన హరి రామ్ కృష్ణాజిల్లా కార్యదర్శులు కూనసాని నాగబాబు, బంటుమిల్లి మండలం ఉపాధ్యక్షులు గొట్రు రవికిరణ్, యడ్లపల్లి లోకేష్, ఒడిమి జయరాజ్, పెడన మండల ఉపాధ్యక్షులు చీరల నవీన్ కృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి సీరం సంతోష్, సమ్మెట చిన్ని, బొమ్మిరెడ్డి భగవాన్, ముదినేని రామకృష్ణ, మోహన్ కృష్ణ, కాజా మణికంఠ, మోచర్ల శర్మ, ఎండ్రపాటి నాగబాబు, సురేష్, పులగం శీను, పెద్ద ఎత్తున జనసైనికులు పాల్గొన్నారు.