ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో అదిరే అభి సినిమా

ప్రభాస్ డెబ్యూ మూవీ ‘ఈశ్వర్’తో టాలీవుడ్‌లో నటుడిగా ప్రవేశించిన అభినయ కృష్ణ.. ఆ తర్వాత మరిన్ని చిత్రాల్లో కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆపై జబర్దస్త్ కామెడీ షోతో అదిరే అభిగా అవతరించి.. మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా అభి ఓ సినిమాతో హీరోగా కూడా మారుతున్నారు. ఆ సినిమా పేరు ‘వైట్ పేపర్’. జీఎస్‌కే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గ్రంధే శివ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాను కేవలం 9 గంటల 51 నిమిషాల వ్యవధిలోనే పూర్తి చేశారు. దాంతో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఈ సినిమాను అరుదైన చిత్రంగా గుర్తించి సత్కరించారు. అదిరే అభి పుట్టిన రోజున రోజును పురస్కరించుకొని రీసెంట్‌గా ‘వైట్ పేపర్’ సినిమా టైటిల్ లుక్‌ను మనో, ఇంద్రజ, అనసూయ లాంచ్ చేశారు. అదిరే అభి, వాణి, తల్లాడ సాయి కృష్ణ, నేహా, నందకిషోర్ తదితరులు నటించిన ఈ సినిమా టైటిల్ లాంఛ్ చేయడం తమకు చాలా ఆనందాన్నిచ్చిందని మనో, ఇంద్రజ, అనసూయ తెలిపారు.