ఒక్క ట్వీట్ తో ఆహా పరువు అంత తీసుకుంది..

తెలుగు మొట్ట మొదటి ఓటిటి ఛానల్ అంటూ ప్రచారం మొదలుపెట్టి..అతి తక్కువ టైం లోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆహా..ఇప్పుడు ఒకే ఒక ట్వీట్ తో వచ్చిన పరువు అంత పోగొట్టుకుంది. నెట్ ఫ్లిక్స్ వాళ్లు తెలుగులో తీసిన తొలి వెబ్ సిరీస్ పిట్ట కథలు టీజర్ లాంచ్ చేసిన సందర్భంగా కొంత హడావుడి జరిగింది సోషల్ మీడియాలో. ఐతే దానికి కౌంటర్గా ఆహా వాళ్లు.. మా దగ్గర ఎన్నో ఒరిజినల్స్ ఉన్నాయి. మేం అరుస్తున్నామా అంటూ ట్వీట్ వేయడం వివాదాస్పదమైంది.

దీనికి నెట్ ఫ్లిక్స్ వాళ్లేమీ బదులివ్వలేదు కానీ.. నెటిజన్లే గట్టిగా స్పందించారు. నెట్ ఫ్లిక్స్ స్థాయి ఏంటో.. అందులో ఎంత కంటెంట్ ఉంటుందో తెలిసిందే. ప్రపంచంలో మరే ఓటీటీ కూడా అంత కంటెంట్ ఇవ్వదు. దాని ఆదరణ గురించి చెప్పాల్సిన పని లేదు. ఐతే ఆహాలో ఉన్న కంటెంట్ పరిమితం. పైగా తెలుగు కంటెంట్ పేరుతో ఎక్కువగా మలయాళ తమిళ కన్నడ డబ్బింగ్ సినిమాలు పెద్ద సంఖ్యలో తెచ్చి పెట్టేశారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. నెట్ ఫ్లిక్స్లో ఉన్న కంటెంట్ను ఆహా కంటెంట్ను పోలుస్తూ పోస్టులు పెట్టి ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.