ఎయిమ్ అవగాహనా సదస్సు

విజయనగరం జిల్లా, చీపురుపల్లి మండలం, పెదనడిపల్లి గ్రామం దళిత వాడలో ఆదివారం ఉదయం విజయనగరం జిల్లా ఎయిమ్ ఇంచార్జి అడ్డురి సీతబాబు, జిల్లా ఎయిమ్ కన్వీనర్ కెల్ల భీమారావు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఎయిమ్ అవగాహనా సదస్సు జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అధితిగా హాజరైన జిల్లా ఇంచార్జి అడ్డురి సీతబాబు మాట్లాడుతూ దళితవాడ పంచాయతీ తోనే, దళిత ప్రజలు అభివృద్ధి చెందుతారన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరు వారు.. కొందరు వారు కాదు అన్నారు. దళిత ప్రజలు ఐక్యత గా ఉండి మన హక్కులను కాపాడుకోవాలన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఆర్ధికంగా అభివృద్ధి చెందాలన్నారు. సభ అధ్యక్షులు జిల్లా ఎయిమ్ కన్వీనర్ కెల్ల భీమారావు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశీయాలతో ఎయిమ్ ను మాన్యశ్రీ పీవీ సునీల్ కుమార్ ఐపీఎస్ డీజీపీ ఏ.పీ.సి.ఐ.డి.చీఫ్ స్థాపించారు అన్నారు. దళిత వాడ పంచాయతీ సాధన దిశగా ఎయిమ్ కృషి చేస్తుంది అన్నారు. ఎయిమ్ ఏ కుల, మత, పార్టీలకు వ్యతిరేకం కాదు అన్నారు. ఎయిమ్ ఆశయాలను చీపురుపల్లి మండలంలో ప్రతి దళిత వాడలకు స్వచ్చందంగా తీసుకువెళ్లాలని ఎయిమ్ కార్యకర్తలుకు విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో పెదనడిపల్లి సర్పంచ్ ఎస్ పోలీరాజ్, ఎంపీటీసీ ఆర్ ఆదినారాయణ, గుర్ల మండలం ఎయిమ్ కన్వీనర్ తలే నారాయణ అప్పడు మెరకముడిదాం మండలం ఎయిమ్ కన్వీనర్ సిర్లి రాము, గుర్ల మండలం సైనిక్ కన్వీనర్ పొట్నూరు రామన్న, గ్రామ పెద్దలు, మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు.