శరత్ చంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఐనా బత్తిన రాజేష్

సింగరాయకొండ పంచాయతీ సెక్రటరీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన శరత్ చంద్రని జనసేన పార్టీ సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనా బత్తిన రాజేష్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బదిలీ అయిన పంచాయతి సెక్రటరీ రామ్మోహన్ రావుకి కూడా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దండే ఆంజనేయులు, దేవినేని బాలాజీ, కాసుల శ్రీనివాస్, గుంటుపల్లి శ్రీనివాస్, అనుమల శెట్టి కిరణ్ కుమార్, సయ్యద్ చాన్ బాషా పాల్గొన్నారు.