ఐరాల జనసేన పార్టీ మండల కమిటీ సమావేశం

పూతలపట్టు: జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఆదేశాలు మేరకు ఐరాల మండల కమిటీ సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశంలో జనసేన పల్లెబాట నిర్వహించి బూత్ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. ఈనెల 10వ తేదీన పేరయ్య గారి పల్లె పంచాయతీ లో ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్ కార్యదర్శి ఏపీ శివయ్య, మండల అధ్యక్షులు పురుషోత్తం, ఉపాధ్యక్షులు శీను, ప్రధాన కార్యదర్శి తులసి బాబు కార్యదర్శులు మహాలక్ష్మి, పూర్ణచంద్ర, వినోద్, భరత్ పాల్గొన్నారు.