నవుడూరు జనసేన ఆధ్వర్యంలో అఖండ అన్నసమారాధన

పశ్చిమగోదావరి, మహాశివరాత్రి సందర్భంగా నవుడూరు గ్రామంలో శివాలయం వద్ద జనసేన పార్టీ జనసైనికుల ఆధ్వర్యంలో అఖండ అన్నసమారాధన జరిగింది. ఈ అన్నసమారాధన కార్యక్రమంలో వీరవాసరం మండల అధ్యక్షులు గుండా రామకృష్ణ, వీరవాసరం జడ్పిటిసి గుండా జయ ప్రకాష్ నాయుడు, వీరవాసరం మండల పరిషత్ ఉపఅధ్యక్షులు అడ్డాల శ్రీరామచంద్రమూర్తి (రాము), నవుడూరు ఎంపిటిసి యాళ్లబండి ఇందిరా మరియు నవుడూరు జనసైనికులు పాల్గొన్నారు.