ఘనంగా అకిరా నందన్ జన్మదిన వేడుకలు

నందికొట్కూరు నియోజకవర్గంలోని పాములపాడు మండలంలో గల ఎర్రగూడూరు గ్రామంలో అకిరా నందన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం గ్రామానికి చెందినటువంటి జనసేన పార్టీ నాయకులు బత్తుల కిరణ్ రాజ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నందికొట్కూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయ బాధ్యులు నల్లమల రవికుమార్ విచ్చేసి కుమారుని పుట్టినరోజు పెట్టుకొని పవన్ కళ్యాణ్ అటవీ ప్రాంతంలో నివసించే వారి అభివృద్ధి కోరి వారి జీవనశైలి మార్చడానికి అటవీ ప్రాంతంలో గడపడం కొందరికే సాధ్యమని, అలాగే సింగపూర్ లోని చిన్న కుమారుని బాధాకరమైన విషయం తెలిసి కూడా హుటాహుటిన బయలుదేరకుండా ప్రజల అభివృద్ధి కొరకు కార్యక్రమం ముగించుకొని వెళ్లడం అనేది మహానుభావులకే సాధ్యమని కొనియాడారు. ఇలాంటి నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి చాలా అవసరం అని ఆ భగవంతుడి ఆశీస్సులతో మార్క్ శంకర్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని తెలియజేసి. అకిరా నందన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బత్తుల కిరణ్ రాజ్ మాట్లాడుతూ జనసేన పార్టీలో పనిచేయటం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు.

Share this content:

Post Comment