అక్కచెరువుపాడు టిడ్కో ఇళ్ళను సందర్శించిన టిడ్కో చైర్మన్

నెల్లూరు జిల్లా, నెల్లూరు రూరల్, అక్కచెరువుపాడు టిడ్కో ఇళ్ళను ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ సోమవారం సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడున్న సమస్యలపై టిడ్కో లబ్ధిదారుల్ని అడిగి తెలుసుకున్నారు. అక్కడున్న నీటి సమస్యను రెండు మూడు రోజుల్లో పరిష్కరించాలని అధికారులను ఆదేశించడం జరిగింది. వీధిలైట్లు ఏర్పాటు చెయ్యాలని అధికారులకు సూచించారు. మాకు బస సౌకర్యం రేషన్ షాప్ కావాలని వేములపాటి అజయ కుమార్ ని కోరడంతో టిడ్కో లబ్ధిదారులకు ఈ సమస్యలపై అధికారులతో చర్చించి పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది. టిడ్కో కాలనీలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరక్కుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుందర్ రామిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గురుకుల కిషోర్, నెల్లూరు జిల్లాకార్యాల ఇంచార్జ్ జమీర్, కారంపూడి కృష్ణన్ రెడ్డి, జనసేన సీనియర్ నాయకులు సుధా మధు మాధవ్, కరీం పవన్ యాదవ్, జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, గుర్రం కిషోర్, యాసిన్, వెంకీ మరియు టిడ్కో అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment