- వి.సి,ఇతర వక్తల ప్రసంగాలకు ముగ్ధులమయ్యామంటున్న విద్యార్థులు
విక్రమ సింహపురి యూనివర్శిటీ నందు డిపార్టుమెంటు ఆఫ్ మెరైన్ బయాలజీ ఆద్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన అంతర్జాతీయ సెమినార్ కు హాజరై తమ ప్రసంగాల ద్వారా అత్యుత్తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించిన ఆంధ్రకేసరి యూనివర్శిటీ ఆక్వా కల్చర్ డిపార్టుమెంటు విద్యార్థులను ఏ.కే.యూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి.వి.ఆర్. మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి హరిబాబు, యూనివర్శిటీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజమోహన్ రావు, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్ నిర్మలా మణి తదితరులు హృదయ పూర్వకంగా అభినందించారు. ఏ.కే.యూ విసి ప్రొఫెసర్ మూర్తి సూచనల మేరకు, రిజిస్ట్రార్, ఆక్వా కల్చర్ విభాగం హెచ్.ఓ.డి ప్రొఫెసర్ హరిబాబు, యూనివర్శిటీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజమోహన్ రావు తదితరుల సహకారంతో విద్యార్థులు ఈ సెమినార్ కు హాజరై తమ పరిశోధక పత్రాలను సమర్పించారు. ఈ అంతర్జాతీయ సెమినార్ నందు ప్రపంచం గర్వించ దగిన అంతర్జాతీయ స్థాయి భౌతిక శాస్త్రం శాస్త్రవేత్తలలో ఒకరైన వి.ఎస్.యూ ఉప కులపతి ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు, దేశ,విదేశాలకు చెందిన అనేక మంది వక్తలు ఇచ్చిన ప్రసంగాలు తమకు ఎంతో పరిజ్ఞానాన్ని అందించాయని, ఆక్వా కల్చర్ రంగంలో పలు అంశాల మీద ఉపన్యాసకులు ఇచ్చిన ప్రసంగాలు, సుధీర్ఘ ఉపన్యాసాలను విని తాము ఎంతగానో ఆనందించడం జరిగిందని విద్యార్థులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్ర కేసరి యూనివర్శిటీ ఏర్పడి కేవలం రెండేళ్లు అయినప్పటికీ,వి.ఎస్.యూ లో ఘనంగా జరిగిన అంతర్జాతీయ స్థాయి సెమినార్ నందు పాల్గొనేందుకు తమకు సువర్ణావకాశం కల్పించిన వి.సి ప్రొఫెసర్ మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ హరిబాబు, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజమోహన్ రావు, తమకు మార్గదర్శకత్వం చేసిన ఆక్వా కల్చర్ విభాగం సహాయ అధ్యాపకులు డాక్టర్ బి సురేష్, డాక్టర్ అశ్వర్థ నారాయణ తదితరులకు విద్యార్థినీ విద్యార్థులు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో భాగంగా అంతర్జాతీయ సెమినార్ నందు పాల్గొన్న విద్యార్థులకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ హరిబాబు ప్రత్యేక అభినందనలు తెలిపిన అనంతరం ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర కేసరి యూనివర్శిటీకి చెందిన పలువురు బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
Share this content:
Post Comment