పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన ఏకేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ హరిబాబు

  • ప్రశాంత వాతావరణంలో పరీక్షల నిర్వహణపై సంతృప్తి

కందుకూరు పట్టణంలోని శ్రీ వివేకా డిగ్రీ కళాశాల నందు జరుగుతున్న ఆంధ్రకేసరి యూనివర్శిటీ ఎం.బి.ఏ మూడవ సెమిస్టర్ పరీక్షా కేంద్రాన్ని ఆంధ్ర కేసరి యూనివర్శిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించి యూనివర్శిటీకి మంచిపేరు తీసుకొని రావాలని నిర్వాహకులకు సూచించారు. విద్యార్థులు పరీక్షలను వ్రాస్తున్న విధానాన్ని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ హరిబాబు నిశితంగా పరిశీలించారు. అనంతరం పరీక్షా నిర్వాహకులకు ఆయన పలు సూచనలు చేశారు. ప్రశాంత వాతావరణంలో సజావుగా, సక్రమంగా పరీక్షలు నిర్వహిస్తూ ఉండటంతో ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. కందుకూరులోని శ్రీ వివేకా డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రం నందు మూడవ సెమిస్టర్ పరీక్షలను సింగరాయకొండలోని అభినవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ కు చెందిన 17 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షలు వ్రాస్తున్నట్లు ప్రిన్సిపాల్ అబ్బూరి వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు జరుగుతూ ఉండటం పట్ల రిజిస్ట్రార్ ప్రొఫెసర్ హరిబాబు సంతృప్తిని వ్యక్తం చేశారు.

Share this content:

Post Comment