ఏ.కే.యూ పరిశోధక నిబంధనావళి పుస్తకం ఆవిష్కరణ

  • కార్యక్రమంలో పాల్గొన్న వి.సి, రిజిస్ట్రార్ తదితరులు

నూతనంగా ఏర్పడిన ఆంధ్ర కేసరి యూనివర్శిటీ నందు ప్రస్తుతం పరిశోధనల కోసం చేరిన స్కాలర్లు, వారికి అనునిత్యం సూచనలు, సలహాలను అందించనున్న రీసెర్చ్ డైరెక్టర్లకు దిక్చూచిగా ఉపయోగపడనున్న “ఆంధ్ర కేసరి యూనివర్శిటీ పరిశోధక నిభంధనావళి “పుస్తకాన్ని సోమవారం సాయంత్రం స్థానిక ఆంధ్ర కేసరి యూనివర్శిటీ వి.సి ఛాంబర్ నందు ఉప కులపతి ప్రొఫెసర్ డి.వి.ఆర్. మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి హరిబాబు తదితరులు లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వి.సి.ప్రొఫెసర్ మూర్తి మాట్లాడుతూ ఈ పరిశోధక నిభందనావళి పుస్తకం ప్రస్తుత సమయంలో ఆంధ్ర కేసరి యూనివర్శిటీ పరిధిలో నూతనంగా పరిశోధక విద్యార్థులుగా చేరిన రీసెర్చ్ స్కాలర్లకు, అదే సమయంలో రీసెర్చ్ గైడ్లకు ఎంతగానో ఉపకరిస్తుందని అన్నారు. అంతే కాకుండా యూనివర్సిటీ పరిధిలో రీసెర్చ్ విభాగం నందు భవిష్యత్ అవసరాల కోసం ఈ నిభంధనావళి అందరికీ మార్గ దర్శకంగా పని చేస్తుందని అన్నారు. ఏ.కే.యూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ హరిబాబు మాట్లాడుతూ ఆంధ్ర కేసరి యూనివర్శిటీ పరిధిలో పరిశోధకులకు, పరిశోధనలో భాగస్వాములుగా ఉన్న రీసెర్చ్ డైరెక్టర్లను దృష్టిలో ఉంచుకుని పూర్తి స్థాయిలో నిబంధనలను పేర్కొంటూ తయారు చేసిన ఆంధ్ర కేసరి యూనివర్శిటీ పరిశోధక నిభంధనావళి అన్ని డిపార్టుమెంటులకు చెందిన స్కాలర్లకు, గైడ్ లకు మార్గనిర్దేశనంగా ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆంధ్ర కేసరి యూనివర్శిటీ పరిధిలో గల ఏ.కే.యూ ప్రాంగణంతో బాటు మరో మూడు పరిశోధనా కేంద్రాల ద్వారా వివిధ అంశాలలో మొత్తం 52 మంది పరిశోధక విద్యార్థులు చేరి తమ పరిశోధనలను కొనసాగిస్తున్నట్లు ఆంధ్ర కేసరి యూనివర్శిటీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్.నిర్మలామణి తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర కేసరి యూనివర్శిటీ కళాశాల ప్రిన్సిపాల్, ఏ.కే.యూ రీసెర్చ్ అడ్వైజరీ కమిటీ సభ్యులు ప్రొఫెసర్ గుత్తి రాజ మోహన్ రావు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం డైరెక్టర్, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్ నిర్మలా మణి, ఏ.కే.యూ సి.డి.సి డీన్ ప్రొఫెసర్ సోమశేఖర తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment