ఏఐయూ పెన్‌కాక్ సిలాట్ పోటీల్లో ఆంధ్ర కేసరి యూనివర్శిటీకి చెందిన విద్యార్థి కే. ప్రేమ్ కుమార్ అఖిల భారత స్థాయిలో బంగారు పతకాన్ని సాధించి విశేష ప్రతిభను చాటుకున్నారు. కర్నాటక రాష్ట్రంలోని నార్త్ బెంగుళూరు యూనివర్శిటీలో ఏప్రిల్ 14వ తేదీ నుండి జరుగుతున్న ఈ పోటీల్లో పురుషుల విభాగంలో పాల్గొన్న ప్రేమ్ కుమార్ తన క్రీడా నైపుణ్యంతో అందరిని ఆకట్టుకున్నారు. ప్రస్తుతానికి ఒంగోలు నగరంలోని ఇందిరా ప్రియదర్శిని లా కళాశాలలో ఎల్.ఎల్.బి మొదటి సంవత్సరం చదువుతున్న ప్రేమ్ కుమార్, తొలి ప్రయత్నంలోనే యూనివర్శిటీకి బంగారు పతకాన్ని తీసుకురావడం గర్వకారణంగా నిలిచింది. ఈ విజయాన్ని పురస్కరించుకొని ఆంధ్ర కేసరి యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి.వి.ఆర్. మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి. హరిబాబు, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి. రాజ మోహన్ రావు, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్. నిర్మల మణి, CDC డీన్ & డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ జి. సోమశేఖర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ డా. ఐ. దేవీ వర ప్రసాద్, అధ్యాపకుడు అడపాల వెంకటేశ్వర్లు, టీం సెలెక్షన్ కమిటీ సభ్యులు జి. సాయి సురేష్, కోచ్ వంశీ తదితరులు ప్రేమ్ కుమార్‌ను హృదయపూర్వకంగా అభినందించారు. అలాగే, ప్రేమ్ కుమార్ చదువుతున్న కళాశాల అయిన ఇందిరా ప్రియదర్శిని లా కళాశాల చైర్మన్ డా. కె. నరసింహారావు, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సి.వి. రామకృష్ణ రావు, ప్రిన్సిపాల్ డా. కె. నటరాజ్ కుమార్ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ప్రేమ్ కుమార్ విజయం ద్వారా యూనివర్శిటీ ప్రతిష్టను దేశవ్యాప్తంగా ఇనుమడింపజేసినందుకు విద్యార్థి, అధ్యాపకులందరూ గర్వంగా భావిస్తున్నారు.
Share this content:
Post Comment