Hanmakonda: కాళోజి ఆశయాలు కొనసాగించాలి: ఆకుల సుమన్

హనుమకొండ, నిజాం నిరంకుశ పాలనపై కలం ఎక్కుపెట్టిన ప్రజాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు, పద్మవిభూషణ్‌ శ్రీ కాళోజీ నారాయణరావు 19వ వర్ధంతి పురస్కరించుకొని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి శ్రీ ఆకుల సుమన్ నివాళులుర్పించారు. ఈ సందర్బంగా ఆకుల సుమన్ మాట్లాడుతూ తెలంగాణ తొలిపోద్దు ఉద్యమమే ఊపిరిగా జీవించిన మహాకవి నా గొడవ పేరిట సమాకాలిన సామజిక సమస్యలపై నిర్మొహమాటంగా నిక్కచ్చిగా స్పందిస్తూ పాలకులపై అక్షరాలు సందించిన సాహితికారుడు అన్యాయాలను శ్రీ కాళోజి ఎదురించి ప్రశ్నించారాని నేటి యువత ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలపునిచ్చారు.